శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 12 జనవరి 2018 (15:27 IST)

మద్యం షాపుల్లో ఆడవాళ్లు... ఏమీ చేయలేక చట్టం మార్చేసిన దేశం...

మద్యం అంటే మహిళలు కస్సుమంటారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మద్యపానం కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో చాలాచోట్ల మద్యపాన నిషేధం వున్నది. ఐతే చాలా దేశాల్లో మద్యం అమ్మనిదే ఆర్థిక పరిస్థితి గాడినపడే పరిస్థితి వుండదు. అందువల్ల మద్యం అమ

మద్యం అంటే మహిళలు కస్సుమంటారన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే మద్యపానం కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమవుతున్నాయి. ఈ నేపధ్యంలో చాలాచోట్ల మద్యపాన నిషేధం వున్నది. ఐతే చాలా దేశాల్లో మద్యం అమ్మనిదే ఆర్థిక పరిస్థితి గాడినపడే పరిస్థితి వుండదు. అందువల్ల మద్యం అమ్మకాలకు గేట్లు బార్లా తెరిచేస్తుంటారు. 
 
ఐతే తాజాగా శ్రీలంకలో మద్యం అమ్మడానికి, కొనేందుకు మహిళలకు అనుమతినిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు.. అంటే గత 38 ఏళ్లుగా శ్రీలంకలో మహిళలు మద్యం అమ్మటం కానీ లేదంటే కొనుగోలు చేసేందుకు కానీ వీల్లేదు. కానీ శ్రీలంక తెచ్చిన కొత్త చట్టంతో మహిళలు ఎంచక్కా మద్యం షాపుల్లో మద్యం విక్రయాలు చేయవచ్చు. అలాగే కొనుగోలు చేయవచ్చు. 
 
ఐతే హఠాత్తుగా శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక వేరే కారణం ఉందంటున్నారు. అదేంటయా అంటే... ఇప్పటికే శ్రీలంక దేశంలో చాలా మద్యం షాపుల్లో మహిళలు మద్యం విక్రయాలు చేసే ఉద్యోగాల్లో చేరిపోవడమేనట. చట్టం వున్నప్పటికీ వారు లెక్కచేయకుండా మద్యం దుకాణాల్లో పనిచేస్తుండేసరికి... ప్రభుత్వమే దిగివచ్చి మహిళలపై వున్న చట్టాన్ని ఎత్తివేసినట్లు చెపుతున్నారు.