సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (11:59 IST)

పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధి... కాశ్మీర్ సమస్యకు తాలిబన్ల సాయం

పాకిస్థాన్ మరోమారు వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. జమ్మూకాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు తాలిబన్ల సాయం తీసుకుంటామని ఆ దేశ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
 
టీవీ చర్చలో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించారని నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో పాకిస్తాన్ సైన్యానికి, తాలిబన్లకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిర్గతం అయ్యాయి. పీటీఐ అధికార ప్రతినిధి నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడగానే అప్రమత్తమైన చానెల్ న్యూస్ యాంకర్‌.
 
ఈ షో ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం అవుతుంది. భారతీయులు కూడా వీక్షిస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా.. మీరేం చెప్పారో మీకు అర్థం అవుతుందా అని నీలం ఇర్షాద్ షేక్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కానీ అతడు ఇవేవి పట్టించుకోకుండా.. ''తాలిబన్లు మాకు సాయం చేస్తారు.. ఎందుకంటే వారిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు'' అంటూ కొనసాగించాడు.