మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (19:34 IST)

తాలిబాన్ నాయకుడితో అమెరికా టాప్ అధికారి సీక్రెట్ మీటింగ్, ఎందుకో?

తాలిబాన్లతో అమెరికా లోపాయికారి ఒప్పందాన్ని ఏమయినా కుదుర్చుందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఏంటయా అంటే, అమెరికా అత్యున్నత నిఘా సంస్థ సిఐఎ డైరెక్టర్ ఏకంగా తాలిబాన్ అగ్రనేత ముల్లాతో సోమవారం నాడు భేటీ కావడమే. వీరి మధ్య భేటీ జరిగిందని తెలిసి ప్రపంచంలోని పలు దేశాలు షాక్ తిన్నాయి.
 
ఐతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ పౌరులను స్వదేశానికి తరలించే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో తలెత్తుతున్న ఇబ్బందులపై ముల్లాతో చర్చించినట్లు సమాచారం. మరోవైపు ఆగస్టు 31 లోపు అమెరికా తన సైనిక బలగాలను ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవాలి. మరి ఈలోపు అది కుదురుతుందా.. దీనిపైనే చర్చ జరిగిందా అనేది తెలియాల్సి వుంది.