గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

గిన్నిస్ రికార్డులకెక్కిన కానే టనాకా ఇకలేరు...

kane tanaka
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్కురాలిగా గిన్నిస్ రికార్డులెక్కిన జపాన్‌కు చెందిన కానే టనాకా కన్నుమూశారు. ఆమె వయసు 119 యేళ్ళు. ఈమె ఈ నెల 19వ తేదీన తుదిశ్వాస విడిచినట్టు జపాన్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 
 
నైరుతి జపాన్‌లోని పుకోకా పట్టణానికి చెందిన కానే 116 యేళ్ల వయసులో మార్చి 2019లో  ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. 
 
కానా టనాకా మృతి చెందడంతో ఇపుడు ఫ్రాన్స్‌కు చెందిన లుసిలీ రాండన్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా నిలిచారు. ఆమె వయసు ప్రస్తుతం 118 సంవత్సరాల 73 రోజులు. కాగా, 1903వ సంవత్సరం జనవరి రెండో తేదీన కానే జన్మించారు. 
 
అదే యేడాది రైట్ సోదరులు విమానాన్ని కనుగొన్నారు. 19 యేళ్ల వయసులో పెళ్లి చేసుకున్న ఆమెకు నలుగురు సంతానం. మరొకరిని దత్తత తీసుకున్నారు. ఆమె భర్త 1937లో చైనా - జపాన్ యుద్ధంలో ప్రాణాలు పాల్గొన్నారు.