గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (22:58 IST)

ప్రపంచ ఐపీ దినోత్సవం పురస్కరించుకుని వ్యాసరచన పోటీ నిర్వహిస్తోన్న రిజల్యూట్‌ 4ఐపీ

Essay Writing Competition
వరల్డ్‌ ఐపీ డే పురస్కరించుకుని రిజల్యూట్‌4ఐపీ, తెలంగాణా స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ)తో భాగస్వామ్యం చేసుకుని  వ్యాసరచన పోటీలను నిర్వహించబోతుంది. ఏప్రిల్‌ 26, 2022 వ తేదీన అంతర్జాతీయ ఐపీ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, 35 సంవత్సరాల లోపు వయసున్న ప్రొఫెషనల్స్‌ ఈ పోటీలో పాల్గొనవచ్చు.

 
ఈ వ్యాస రచన పోటీలకు నమోదు చేసుకోవడం ద్వారా ఉత్సాహపూరితమైన బహుమతులు కూడా పొందవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 26వ తేదీని వరల్డ్‌ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ డేగా నిర్వహిస్తున్నారు. దీనిద్వారా సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఇంటలెక్చువల్‌ ప్రోపర్టీ డే పురస్కరించకుని రిజల్యూట్‌ 4ఐపీ చేత శక్తివంతమైన ఐపీ బడ్డీ ఓ వ్యాసరచన పోటీని టీఎస్‌ఐఐసీ భాగస్వామ్యంతో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్‌స్కూల్‌, లెక్సార్బిస్‌ వద్ద నిర్వహించనుంది.

 
ఈ వ్యాసరచన పోటీలను ‘ఐపీ మరియు యువత- అత్యుత్తమ భవిష్యత్‌ కోసం ఆవిష్కరణలు’ అనే అంశం ఆధారంగా 2022 విపో నేపథ్య అనుగుణంగా నిర్వహించనున్నారు.