ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (17:33 IST)

విమాన ప్రమాదం.. గుండెను భద్రపరిచిన బాక్సు కిందపడినా..?

Heart
అమెరికాలో అద్భుతం జరిగింది. వైద్యులు శభాష్ అనిపించారు. సౌత్ క్యాలిఫోర్నియాలో ఓ పేషెంట్‌కు గుండెను మార్చాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసి హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తేనే బాధితుడు బ్రతుకుతాడు. దీంతో బాధితుడి కుటుంబం హార్ట్ డోనర్ సాయంతో గుండెను బాక్స్‌లో భద్రపరిచారు. అలా భద్రపరిచిన బాక్స్‌ను శాన్ డియాగో నుండి ఎనిమిది సీటర్ల ప్రైవేట్ హెలికాప్టర్‌లో సుమారు 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న సౌత్ క్యాలిఫోర్నియాలోని కెక్ హాస్పటల్ యూనివర్సిటీకి తరలించారు.
 
కెక్ ఆస్పత్రి బిల్డింగ్ హెలీఫ్యాడ్‌పై హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అదే సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ ఒక్కసారిగా హెలిఫ్యాడ్‌పై కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. కూలిన హెలికాఫ్టర్‌లో నుంచి గుండెను భద్రపరిచిన బాక్సును బయటకు తీశారు. అనంతరం ఆ బాక్స్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళుతున్న సిబ్బంది చేతిలో ఉన్న ఆ బాక్స్ ఒక్కసారిగా కిందపడింది. 
 
దీంతో ఆందోళనకు గురైన డాక్టర్లు హడావిడిగా ఆ బాక్సును ఐసీయూలోకి తీసుకెళ్లి విజయవంతంగా ఆపరేషన్ చేసి గుండెను ట్రాన్స్ ఫ్లాంట్ చేశారు. దీంతో గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న రోగి ఆరోగ్యం కుదుటపడింది. అయితే ఈ ఘటన ఓ అద్భుతమని డాక్టర్లు సిబ్బందిని కొనియాడారు. హెలికాఫ్టర్‌కు ప్రమాదం జరిగినా.. చేతిలో నుంచి బాక్స్ కిందపడినా ఎలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు.