గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2022 (12:07 IST)

ఎట్టకేలకు నేను నమ్మే వ్యక్తి దొరికాడు: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య 3వ పెళ్లి

Imran khan
Imran khan
ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య మూడవ పెళ్లి చేసుకుంది. ఎట్టకేలకు తాను మీర్జా బిలాల్‌ని విశ్వసించగల వ్యక్తిని కనుగొన్నానని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ తెలిపారు. మోడల్, నటుడు మీర్జా బిలాల్ బేగ్‌ను తాను వివాహం చేసుకున్నట్లు రెహమ్ ఖాన్ ప్రకటించారు. తాము ఈ మేరకు పెళ్లి వేడుక ద్వారా ఒక్కటయ్యామని చెప్పుకొచ్చింది. 
 
సోషల్ మీడియాలో పంచుకున్న ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలలో రెహమ్ ఖాన్ తెల్లటి వెడ్డింగ్ గౌను ధరించగా, ఆమె 36 ఏళ్ల భర్త బిలాల్ మావ్ సూట్ ధరించి కనిపించాడు. జస్ట్ మ్యారీడ్ అని రాసుకొచ్చాడు. 
 
USఆధారిత కార్పొరేట్ ప్రొఫెషనల్, మాజీ మోడల్ అయిన మీర్జా బిలాల్ బేగ్‌కి ఇది మూడవ వివాహం. 2015లో, పాకిస్తానీ-బ్రిటీష్ టెలివిజన్ జర్నలిస్ట్ రెహమ్ ఖాన్ ఇస్లామాబాద్ ఇంట్లో జరిగిన ఒక వేడుకలో ఇమ్రాన్ ఖాన్‌తో వివాహం జరిగింది. అయితే పది నెలల తర్వాత అతనికి విడాకులు ఇచ్చారు.