పాకిస్థాన్‌కు డ్రోన్లతోపాటు సైన్యాన్ని కూడా పంపించిన టర్కీ
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం కోసం పాకిస్థాన్ తరపున యుద్ధ క్షేత్రంలో పోరాడేందుకు టర్కీ తమ అత్యాధునిక డ్రోన్లతో పాటు సైన్య బలగాలను కూడా పంపించింది. ముఖ్యంగా డ్రోన్ల వాడకంపై పాకిస్థాన్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఈ టర్కీ సైనికులు పాకిస్థాన్‌కు వెళ్లారు. తాజాగా ఈ విస్తుగొలిపే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింద. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యలో చనిపోయిన పాకిస్తాన్ సైనికుల్లో ఇద్దరు టర్కీకి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.
పాకిస్థాన్ టర్కీల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు ఇటీవల భారీగా పెరిగాయి. భారత్‌పై దాడికి పాకిస్థాన్, టర్కీకి చెందిన వందల సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించింది. అయితే, వాటి వినియోగంపై అవగాహన కల్పించడానికి తమ మిలిటరీకి చెందిన వ్యక్తులను ఇస్లామాబాద్‌కు టర్కీయే పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ భారీ స్థాయిలో భారత్‌పై డ్రోన్ దాడులు చేసింది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్ కూల్చివేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీయేకు చెందిన ఆస్ఫి గార్డ్ సోనగర్ డ్రోన్లను ధృవీకరించారు.