శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (08:31 IST)

టర్కీలో మళ్లీ భూకంపం - గత రాత్రి 6.4 తీవ్రతతో ప్రకంపనలు

earthquake
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపాల ధాటికి ఆ రెండు దేశాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. దాదాపు 46 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టర్కీలోనే భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ భూకపం మిగిల్చిన గాయం నుంచి టర్కీ వాసులు ఇంకా కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో గత రాత్రి మరోమారు టర్కీలో భూమి కంపించింది. ఇది భూకంప లేఖినిపై 6.4గా నమోదైంది. అదేసమయంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
గత రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ భూకంపం సంభవించింది. దేశ దక్షిణ ప్రాంతమైన హటే ప్రానిన్స్‌లో 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. గత భూకంపం కారణంగా బీటలు వారిన భవనాలు ఇంకా కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, రెండు వారాల క్రితం ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున టర్కీలోని దక్షిణ కహ్రామన్మారస్ ప్రావిన్స్‌‍తో పాటు సిరియాలో సంభవించిన భారీ భూకంపం తర్వాత మరో 40 సార్లు భూమి కంపించిందింది. ఈ కారణంగా వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. పట్టణాలు శ్మశానవాటికలను తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోమారు భూమి కంపించడంతో టర్కీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు.