బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 జూన్ 2022 (14:52 IST)

సముద్రంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

woman pregnency
జోసీ ప్యూక్టర్ అనే 37 యేళ్ళ మహిళ నికారగువాలోని ప్లాయా మజగువాల్‌ సముద్రతీరం (ఫసిపిక్ సముద్రం)లో పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. వైద్య సిబ్బంది సాయం లేకుండానే ఆమె ప్రస్వించారు. సముద్రంలో ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ, ముద్దాడుతూ దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. 
 
ఇక్కడో విషయం గమనించాల్సివుంది. ఆ మహిళ గర్భందాల్చిన తర్వాత ఒక్కసారి కూడా కడుపులో బిడ్డ ఎలా ఉండాడన్న విషయంపై స్కానింగ్ చేయలేదు. అయితే, పూర్తిగా సురక్షితంగా ప్రసంవించడానికి అయ్యేలా అన్ని విషయాలను తెలుసుకున్నట్టు ఆమె చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట ఇపుడు వైరల్‌గా మారింది. ఎలాటి వైద్య సలహాలు, సూచనలు లేకుడా తనంతకు తానుగానే రీసెర్చ్ చేసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోసీ ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.