సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (14:46 IST)

గానగంధర్వుడు ఎస్పీబీ 75వ జయంతి.. అదొక స్వర్ణయుగం అన్న బాబు

SPBalu
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి నేడు. గతేడాది ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా అనంతర సమస్యలతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమ, ఆయనతో అనుబంధం ఉన్నవారు, అభిమానులు జయంతి సందర్భంగా ఆ మహోన్నత కళాకారుడ్ని స్మరించుకుంటున్నారు. దక్షిణాది, ఉత్తరాది ప్రముఖులు, ఫ్యాన్స్ బాలసుబ్రహ్మణ్యం జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. 
 
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో స్పందించారు. సినీ సంగీత చరిత్రలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రస్థానం ఒక స్వర్ణయుగం అని చంద్రబాబు కొనియాడారు. 
 
ఎన్నో అజరామరమైన పాటలను ఆలపించి ఆబాల గోపాలాన్ని మంత్రముగ్ధులను చేశారని చంద్రబాబు  కీర్తించారు. ఆ మధుర గాయకుని జయంతి సందర్భంగా ఆయన కళారంగ సేవలను స్మరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
 
కాగా... నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో దాదాపు 37వేల పాటలు పాడిన గానగంధర్వుడు. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఇంజనీరింగ్‌ను మధ్యలోనే వదిలేసి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. నటుడి గాత్రాన్ని బట్టి తన కంఠాన్ని మలిచి మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. ఎన్ఠీఆర్ కి పాడితే ఆయన నోట్లోంచి పాట ఊడిపడినట్టుంటుంది అలాగే ఏఎన్నార్, కృష్ణ, రాజబాబు, అల్లు రామలింగయ్య. ఈటీవీ ప్రారంభిచిన ' పాడుతా తీయగా ఓ వారి పాత్ర అద్వితీయం. వందలాది మంది వర్ధమాన గాయకులకు ఊపిరులూదారు. పాటలలోను మర్మం, నేపధ్యం వంటి అంశాలను వివరించడం ఆయన ప్రత్యేకత. నటుడిగాకూడా వెండితెరపై తనదైన ముద్ర వేశారు.
 
ఇదే కాక ఆయనకున్న మరో గొప్ప లక్షణం ఆ పాటకు అభినయించే నటుడి హావభావాలను అనుసరించి పాడడం. ఇది తెలుగులో మరే గాయకుడూ చేయలేదన్నది వాస్తవం. ఏ నటుడికి పాడినా బహుశా ఆ నటుడే స్వయంగా పాట పాడాడేమో అనిపించేంతలా పాడగలరు బాలు. ఇక పదాల విరవడంలో, అక్షరాలను నొక్కడంలో ఆయనకు ఆయనే సాటి.
 
అతను 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు.[7] 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించాడు. ఇందులో రాధిక కథానాయిక. 
 
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో సంగీత దర్శకుడు కె.చక్రవర్తి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కి చక్రవర్తి డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక క్యారెక్టర్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. 
 
పద్మశ్రీ (2001) 
డాక్టరేటు, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా పొందరు. 
పద్మభూషణ్ (2011)
శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), 
కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా
పద్మ విభూషణ్ (2021) లో పొందారు.