ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Selvi

ఐపీఎల్‌కు వివో సంస్థ స్పాన్సర్.. కేకేఆర్‌కి జియోనీ స్పాన్సర్.. చైనా కంపెనీల హవా

చైనాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. భారత క్రికెట్‌ను మాత్రం చైనా శాసిస్తోంది. ఐండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో వివో సంస్థ అధికారిక స్పాన్సర్‌‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌-10లో ఆర్‌సీబీ, కేకేఆ

చైనాలో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. భారత క్రికెట్‌ను మాత్రం చైనా శాసిస్తోంది. ఐండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో వివో సంస్థ అధికారిక స్పాన్సర్‌‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌-10లో ఆర్‌సీబీ, కేకేఆర్‌ జట్ల జెర్సీల హక్కుల కోసం జియోనీ సంస్థ రూ.75 కోట్లు ఖర్చు చేసిందట. కాగా, టీమిండియాకు స్పాన్సర్‌గా ఐదేళ్ల హక్కుల కోసం ఒపొ కంపెనీ రూ.1,079 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 
 
ఇక విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరుతో పాటు కోల్‌కతా (కేకేఆర్‌)కు జియోనీ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. భారత్‌లో క్రికెట్‌, బాలీవుడ్‌ను ఓ ప్రత్యేక మతంగానే భావిస్తారని.. అలాంటి ప్రాశస్త్యమున్న ఐపీఎల్ ద్వారా ప్రచారం సంపాదించుకోవడం తమకు ముఖ్యమన్నారు. ఫ్యాన్స్‌తో పాటు తమకు కూడా దీపావళి పండగ వంటిది ఐపీఎల్ అని జియోనీ చీఫ్ అరవింద్ వెల్లడించారు.