శనివారం, 14 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (16:46 IST)

ఐపీఎల్ 2018 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా శనివారం మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 పోటీల్లో భాగంగా శనివారం మరో ఆసక్తికర పోటీ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
 
ఈనేపథ్యంలో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మోహిత్ శర్శ స్థానంలో అంకిత్ రాజ్‌పుత్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
 
రెండు జట్లు ఆడిన తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఘనవిజయం సాధించి మంచి ఉత్సాహంగా ఉన్నాయి. పంజాబ్ జట్టులో క్రిస్‌గేల్.. కోల్‌కతా టీమ్‌లో ఆండ్రీ రసెల్ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. శనివారం మ్యాచ్‌లో వీరిద్దరూ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈడెన్‌లో సుడిగేల్ తన మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.