బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By మోహన్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (17:53 IST)

అందరి కళ్లూ అతడి వైపే.. ఎవరతను?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పన్నెండో సీజన్ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్ వన్ సైడ్ అయ్యి నిరాశపరచినప్పటికీ, ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేసారు. సోమవారం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య నేడు మ్యాచ్‌ జరగనుంది. 
 
బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంలో నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ జట్టులోకి తిరిగి వచ్చాడు. సొంత మైదానంలో బరిలో దిగుతున్న రాజస్థాన్‌ జట్టుకు ఆజింక్యా రహానె నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. సహచరులతో కలిసిపోయిన స్మిత్‌ ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఎంత స్వేచ్ఛగా ఆడుతాడన్నది ఆసక్తికరమైన విషయం. 
 
మోచేతి గాయం నుంచి కోలుకుంటున్న స్మిత్ నేటి మ్యాచ్‌తో బ‌రిలో దిగుతాడో లేదో వేచి చూడాల్సిందే. అలాగే జట్టు నిండా స్టార్లతో ఉన్న పంజాబ్‌కు సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున కరీబియన్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ శుభారంభాన్ని అందించాలని సిద్ధంగా ఉన్నారు.
 
జట్ల అంచనా:
రాజస్థాన్‌: ఆజింక్యా రహానె(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌స్టోక్స్‌, రాహుల్‌ త్రిపాఠి, కృష్ణప్ప గౌతమ్, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, ధవల్‌ కులకర్ణి, జయదేవ్‌ ఉనద్కత్‌ 
 
పంజాబ్‌: అశ్విన్‌(కెప్టెన్‌) అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌గేల్‌, లోకేశ్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, మన్‌దీప్‌ సింగ్‌, శామ్‌ కరన్‌, ముజీబ్‌ రహమాన్‌, ఆండ్రూ టై, వరుణ్‌ చక్రవర్తి, మహ్మద్‌ షమీ
 
రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.