ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది... ఢిల్లీ జట్టు ఫిజియోకు కరోనా సోకింది... (video)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేశారు. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. అయితే, ఈ టోర్నీ కోసం యూఏఈ గడ్డపై అడుగుపెట్టిన ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది, అధికారులను కరోనా వెంటాడుతోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన 13 మంది ఆటగాళ్లు మహమ్మారి బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.
అలాగే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మెడికల్ కమిషన్ సభ్యుడు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్ పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. దుబాయికు వెళ్లిన అనంతరం రెండు సార్లు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అపుడు నెగెటివ్ అని వచ్చింది. మూడోసారి మళ్లీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా అని తేలింది. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు.
అయితే, అసిస్టెంట్ ఫిజియో ఆటగాళ్లు, సిబ్బందితో కలువలేదని, ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం దుబాయిలోని ఐపీఎల్ ఐసోలేషన్ ఫెసిలిటీలో 14 రోజులు ఉన్నాడన్నాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరడానికి రెండు పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టులు రావాల్సి ఉంటుంది. కాగా, ఫిజియోథెరపిస్ట్ పేరును ఐపీఎల్ బృందం చెప్పలేదు. కాగా, ఐపీఎల్ కోసం వెళ్లి కరోనా మహమ్మారి బారినపడ్డ వారి సంఖ్య 15కు చేరింది.