ఐపీఎల్ వేలం పాటలు : కడప కుర్రోడికి లక్కీ ఛాన్స్...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ గురువారం ఆటగాళ్ళ వేలం పాటలు జరిగాయి. ఈ పాటల్లో ఏపీలోని కడప జిల్లా కుర్రోడికి లక్కాఛాన్స్ వరించింది. జిల్లాలోని చిన్నమండెం మండలం బోనమల గ్రామసమీపంలోని నాగూరివాండ్లపల్లెకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు హరిశంకరరెడ్డిని చెన్నైలో గురువారం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
డిగ్రీ వరకు చదువుకున్న ఈ కుర్రోడు బౌలింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పైగా, అండర్-19లో రాష్ట్ర జట్టుకు ఎంపికై 2016 నుంచి ఆడడం మొదలు పెట్టాడు. అనంతరం రంజీ జట్టుకు ఎంపికయ్యాడు. 2018 నుంచి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నాడు.
హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఐపీఎల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఆకాంక్షించారు.