సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మార్చి 2024 (05:34 IST)

2024 ఐపీఎల్‌లో ధోనీ ఆడుతాడా? ఆ పోస్ట్ అర్థమేంటి?

Dhoni
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఎంఎస్ ధోనీ ఆడతాడని అందరూ భావించారు. 2023లోనే రిటైర్మెంట్ వుంటుందని అంచనా వేశారు. కానీ ధోనీ నుంచి ప్రకటన వెలువడలేదు. గత సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుచుకుని విజేతగా నిలిచింది. ఆపై ధోనీ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. 
 
ఇటీవలే అతడి ప్రాక్టీసుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో 2024 సీజన్‌లో ఆడటం ఖాయమని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ వేదికగా టీమిండియా మాజీ స్టార్ ధోనీ ఆసక్తికర పోస్ట్ చేశాడు. 
 
కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం వేచిచూడలేకపోతున్నాను. వేచి వుండండి.. అంటూ ఎఫ్‌బీలో ధోనీ పెట్టిన పోస్టు అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు దారితీసింది. 
 
ధోనీ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడా.. లేదా ఇంకేదైనా పాత్ర పోషిస్తాడా అనే చర్చ మొదలైంది. కోచ్, మెంటార్‌గా ధోనీ బాధ్యతలు చేపడతాడని ఫ్యాన్స్ అంటున్నారు.