Biodata Maker
✕

సురేష్ రైనా రెండో సారి తండ్రి అయ్యాడు.. రియా రైనాకు తమ్ముడొచ్చాడు..

Written By సెల్వి
Updated: మంగళవారం, 24 మార్చి 2020 (13:34 IST)
టీమిండియా మాజీ క్రికెటర్, అదుర్స్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా రెండోసారి తండ్రి అయ్యాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చెన్నై ఫ్యాన్స్ ఆతనిని చిన్న తలై అని పిలుస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో సురేష్ రైనా భార్య రెండో శిశువుకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోను సురేష్ రైనా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో భార్య, శిశువుతో సురేష్ రైనా కనిపించారు. తన కుమార్తె రియా రైనా తమ్ముడిని స్వాగతిస్తున్నామని తెలిపాడు.  
 
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న రైనా గత నెలలోనే చెన్నైలో శిక్షణ ప్రారంభించాడు. తెలుగు క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి సాధన చేశాడు. 
 
అయితే కరోనా వైరస్ వ్యాప్తి లోకి రావడంతో ఐపీఎల్‌ను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ శిక్ష‌ణ శిబిరాల్లో ఉన్న‌టువంటి క్రికెటర్లు అందరూ తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్‌పై బీసీసీఐ ప్రకటన కొరకు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సందిగ్ధంలో పడింది.

అన్నీ చూడండి

తెలంగాణలో నీటి సంరక్షణకు ఆనందన- కోకా-కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ఎమ్ సెహగల్ ఫౌండేషన్‌లకు జాతీయ అవార్డు

లాటరీ కంపెనీ నుంచి డీఎంకే - అన్నాడీఎంకేలకు రూ.260 కోట్ల విరాళం

పుంగనూరు ఘటన వెనుక పెద్దిరెడ్డి కుటుంబం : ప్రత్యక్ష సాక్షిని నేనే : రామచంద్ర యాదవ్

మీరట్ కేసు : భర్తను చంపి దుప్పట్లో పామును వదిలిన భార్యకు ఉరిశిక్ష

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించి మోసం చేశాడు..

అన్నీ చూడండి

కచా బాదం పాటను డిస్ప్లే చేసారని కాన్పూర్ దాండియా ఈవెంట్ నుండి అంజలి అరోరా నిష్క్రమణ

Nag: ఇట్లు అర్జున సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది : నాగార్జున

Devika Bhat: రియాలిటీ ప్రేమలో మునిగిపోయిన కిరణ్ అబ్బవరం, దేవికా భట్

Jabardasth Emmanuel: నందినీ రెడ్డి ఆవిష్కరించిన డెస్టినీ ఫస్ట్ లుక్

Dulquer Salmaan: ఆకాశంలో ఓ తార చిత్రం టీజర్ సిద్ధమవుతోంది

తర్వాతి కథనం
Show comments