మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr

ఎయిర్‌టెల్.. 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్...

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349 టారీఫ్‌పై ఈ 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ప్రకటించింది.

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.349 టారీఫ్‌పై ఈ 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే రూ.349 ప్లాన్‌ కింద ఎయిర్‌టెల్‌ రోజుకు 1 జీబీ డేటా చొప్పున 28 జీబీ డేటాను 28 రోజుల పాటు అందిస్తుండగా… దీనితోపాటు, లోకల్, ఎస్టీడీ కాల్స్‌ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. 
 
ఎలాంటి ఛార్జీలు లేకుండా వారానికి 100 నిమిషాలు కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఈ పరిమితిని మించితే మాత్రం ఎయిరెటెల్‌ నంబర్లకు నిమిషానికి 10 పైసలు కాల్ చార్జ్ వసూలు చేస్తుండగా… ఇతర నెట్‌వర్క్‌లకు అయితే నిమిషానికి 30 పైసలు చొప్పున కాల్ చార్జీలు వసూలు చేస్తోంది. 
 
తాజాగా తెచ్చి క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాంటే మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ వందశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఒకేసారి కాకుండా ఏడు వాయిదాల్లో అందించనుంది. అంటే రూ.349ను ఏడు నెలల్లో వెనక్కి ఖాతాలో జమ చేయనుంది. ఇది కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.