శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (15:48 IST)

జియోకు షాక్... రూ.1399కే ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్ ఫోన్

రిలయన్స్ జియోకు షాకిచ్చేలా ఎయిర్‌టెల్ ఓ నిర్ణయం తీసుకుంది. రూ.1399కే 4జీ స్మార్ట్ ఫీచర్‌ ఫోనును అందించనుంది. ఇందుకోసం కార్బన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో కేవలం రూ.139

రిలయన్స్ జియోకు షాకిచ్చేలా ఎయిర్‌టెల్ ఓ నిర్ణయం తీసుకుంది. రూ.1399కే 4జీ స్మార్ట్ ఫీచర్‌ ఫోనును అందించనుంది. ఇందుకోసం కార్బన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కార్బన్ మొబైల్స్ భాగస్వామ్యంతో కేవలం రూ.1399కే 4జీ స్మార్ట్ ఫోన్‌ను అందిస్తున్నామన తెలిపింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా వస్తున్న ఈ ఫోన్‌లో ఫుల్‌ టచ్‌స్క్రీన్, డ్యూయల్ సిమ్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటి ఆప్షన్లు ఉంటాయని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ పేరును 'కార్బన్ ఏ40'గా నిర్ణయించామని చెప్పింది.
 
అయితే, ఈ ఫోన్ కావాలనుకునేవారు ముందుగా రూ.2899 డౌన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఫోన్‌తో పాటు 36 నెలల పాటు ప్రతి నెలా 169 రూపాయల రీచార్జ్ అవుతుంటుంది. అలాగే, ఫోన్ కొనుగోలు చేసిన 18 నెలల తర్వాత రూ.500 రీఫండ్ చేస్తారు. 36 నెలల తర్వాత (మూడేళ్ళలో) మరో రూ.1000 రీఫండ్ చేస్తారు. అంటే, రూ.1500 క్యాష్ బెనెఫిట్ ఉంటుందన్నమాట. 
 
ఈ ఫోన్‌లో 4 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 1.3గిగాహెట్జ్ ప్రాసెస్సర్. 1400 ఎంఏహెస్ బ్యాటరీ, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 32జీబీ వరకు ఎక్స్‌పాండబుల్, డ్యుయల్ సిమ్. ఎయిర్‌టెల్ వీవోఎల్‌టీఈ సపోర్టుతో పని చేసే ఈ ఫోన్ ఇది 2జీ, 3జీ, 4జీతో అనుసంధానించవచ్చు. ఇందులో 22 భారతీయ భాషలకు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే, ఎయిర్‌టెల్ యాప్స్‌ను కూడా అందుబాటులో ఉన్నాయి.