శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (12:16 IST)

రూ.5 వేలకే అమెజాన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెట్‌లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. టెన్.ఆర్ డి (10.or D) పేరుతో దీన్ని రిలీజ్ చేయనుంది. 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలై

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మార్కెట్‌లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. టెన్.ఆర్ డి (10.or D) పేరుతో దీన్ని రిలీజ్ చేయనుంది. 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.4,999, రూ.5,999 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది. జనవరి 5వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్‌కు‌గాను ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నారు. 
 
ఈ ఫోనులోని ఫీచర్లను పరిశీలిస్తే, 5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 425 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫోన్ కోసం కేవలం ఆమెజాన్ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంది.