శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2017 (13:38 IST)

అమేజాన్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. జనవరిలో మార్కెట్లోకి..

ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమేజాన్ ఇండియా త్వరలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. టెనార్ బ్రాండ్‌తో ఇప్పటికే రెండు ఫోన్లను విడుదల చేసిన అమేజాన్, కొత్త సంవత్సరంలో ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను వి

ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమేజాన్ ఇండియా త్వరలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. టెనార్ బ్రాండ్‌తో ఇప్పటికే రెండు ఫోన్లను విడుదల చేసిన అమేజాన్, కొత్త సంవత్సరంలో ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 
 
ఆన్‌లైన్ వ్యాపారంలో అమేజాన్‌కి పోటీగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి అడుగుపెట్టి, బిలియన్ బ్రాండ్ పేరుతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసిన నేపథ్యంలో.. ఇప్పటికే టెనార్ బ్రాండ్ పేరుతో ఈ, జీ అనే స్మార్ట్ ఫోన్లను అమేజాన్ విడుదల చేసింది. 
 
ఓ వైపు ఆన్‌లైన్ మార్కెట్‌లో త‌న స‌త్తాను చాటుతూ, మ‌రోవైపు మొబైల్ మార్కెట్‌ను విస్త‌రించుకునేందుకు అమేజాన్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో టెనార్ నుంచి మూడో ఫోన్‌ను జనవరిలో విడుదల చేయనున్నట్లు అమేజాన్ ఇండియా వెల్లడించింది.