శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 అక్టోబరు 2024 (14:36 IST)

5జీ స్మార్ట్ ఫోనును లాంఛ్ చేయనున్న బీఎస్ఎన్ఎల్

bsnl 5g phone
భారత టెలికాం మార్కెట్‌లో మరో సంచలనానికి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎన్ తెరతీసింది. అతి తక్కువ ధరతో, అందరికీ అందుబాటులో ఉండేలా 5జీ స్మార్ట్ ఫోను మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. సెమీ అర్బన్ ఏరియాల్లో బలంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ అక్కడి ఖాతాదారులను లక్ష్యంగాచేసుకుని ఈ స్మార్ట్ ఫోనును తీసుకొచ్చింది. 
 
5జీ రేస్‌లో వెనుకబడిపోయిన బీఎస్ఎన్ఎల్ ఇపుడు ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. త్వరలోనే 4జీ నెట్‌వర్క్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇపుడు 5జీ ఫోనును అందరికీ దగ్గరికి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఫోనులోని ఫీచర్లను పరిశీలిస్తే, 
 
6.5 అంగుళాల హెచ్.డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, ఆక్టాకోర్ 5జీ చిమ్ సెట్, 4జీ లేదా 6జీ ర్యామ్ ఆపర్షన్లు, 64 లేదా 128 జీపీ స్టోరేజ్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్లతో వచ్చే ఈ ఫోన్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.