దీపావళి ధమాకా పేరుతో రిలయన్స్ జియో ఆఫర్...
దీపావళి పండుగ వేళ రిలయన్స్ జియో మరో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జియో దీపావళి ధమాకా పేరుతో ఈ ప్రకటన చేసింది. ఈ ఆఫర్‌లో జియో భారత్ ఫీచర్ ఫోను ధరను గణనీయంగా తగ్గించింది. ఈ ప్రత్యేక ఫీచర్ కింద్ ఫోన్ ధరను రూ.999 నుంచి రూ.699 తగ్గిస్తున్నట్టు ప్రటించింది. అయితే, ఈ ఆఫర్ పరిమితకాలం వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. 4జీ సామర్థ్యంతో కూడిన ఫోనును తక్కువ ధరకే కస్టమర్లు తీసుకోవచ్చని పేర్కొంది.
జియో భారత్ 4జీ ఫోన్ల యూజర్లు నెలకు రూ.123 రీఛార్జ్ అపరిమిత వాయిస్ కాల్స్ పొందొచ్చని, 455 టీవీ ఛానళ్లు, 14 జీబీ డేటా వంటి ఆకర్షణీయ సర్వీసులను పొందవచ్చని జియో ప్రస్తావించింది. ఫీచర్ ఫోన్ల విషయంలో ఇతర టెలికం ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ రీఛార్ట్లతో పోల్చితే జియో భారత్ ప్లాన్ దాదాపు 40 శాతం చౌకైనదని పేర్కొంది. జియో యూజర్లు ప్రతి నెలా రూ.76ను ఆదా చేసుకోవచ్చని అని వివరించింది.
కేవలం రూ.123 నెలవారీ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 14 జీబీ డేటా, 455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానళ్లు, మూవీ ప్రీమియర్లు, లేటెస్ట్ సినిమాలు, వీడియో షోలు, స్పోర్ట్స్ లైవ్స్ చూడొచ్చు. అంతేకాదు జియో సినిమాలోని కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఈ ఫోన్‌ను ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్లతో డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. అంతేకాదు పేమెంట్స్ స్వీకరించవచ్చు. జియో చాట్ వీడియోలు, ఫొటోలు, మెసేజులను షేర్ చేయవచ్చని జియో పేర్కొంది.
ఇక జియో భారత్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది 1.77 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, టార్చ్ లైట్, ఎఫ్ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 128జీబీ వరకు ఎస్డీ కార్డు సపోర్ట్ ఇస్తుంది. దీని యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.