బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (16:47 IST)

'నమ్మదగిన సోర్స్ కాదు' : ఈ వార్నింగ్‌తో మాకు సంబంధం లేదు: ఫేస్‌బుక్‌

ప్రస్తుత ఇంటర్నెట్‌ ప్రపంచంలో సమాచారానికి కొదవ లేదు. అంతర్జాలంతో కనెక్ట్ అయితే చాలు సమస్త విషయాలు మన కళ్ల ముందున్న తెరపై ప్రత్యక్షమవుతాయి. అయితే అలా కనిపించే విషయాలన్నీ వాస్తవాలని నమ్మడానికి వీలు లేదు

ప్రస్తుత ఇంటర్నెట్‌ ప్రపంచంలో సమాచారానికి కొదవ లేదు. అంతర్జాలంతో కనెక్ట్ అయితే చాలు సమస్త విషయాలు మన కళ్ల ముందున్న తెరపై ప్రత్యక్షమవుతాయి. అయితే అలా కనిపించే విషయాలన్నీ వాస్తవాలని నమ్మడానికి వీలు లేదు. ఇప్పుడున్న పెద్ద సమస్య ముందున్న సమాచారంలో ఏది వాస్తవం.. ఏది అవాస్తవం అని నిర్ధారించుకోవడమే.
 
ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ సైట్‌ ఫేస్‌బుక్ సైతం ఇలాంటి అవాస్తవాల ప్రచారాలకు వేదికగా మారుతోంది. దీంతో యూజర్లను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గత నెల వెల్లడించారు. దీనిపై ఫేస్‌బుక్‌ నిపుణుల బృందం దీనిపై కసరత్తులు ప్రారంభించింది.
 
అయితే ఇటీవల ఫేక్ ఇన్ఫర్మేషన్‌కు సంబంధించి యూజర్లను అలర్ట్‌ చేసే ఫీచర్‌ను ఫేస్‌బుక్ టెస్ట్ రన్ చేసిందని, ఓ వినియోగదారుడి మొబైల్‌ స్క్రీన్‌పై 'నమ్మదగిన సోర్స్ కాదు' అంటూ ఫేస్‌బుక్ వార్నింగ్‌ లేబుల్‌ కనిపించిందని కోన్ని వెబ్ సైట్లు కథనాలు ప్రచురించాయి. 
 
దీంతో ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. సదరు వినియోగదారుడి మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించిన వార్నింగ్ లేబుల్ గూగుల్‌ క్రోమ్ అప్‌డేట్‌ వెర్షన్‌ ద్వారా వచ్చిందని.. అది ఫేస్‌బుక్ చర్య కాదని స్పష్టం చేశారు.