సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (13:02 IST)

క్రోమ్ యూజర్లకు హ్యాకింగ్ ముప్పు.. హెచ్చరించిన గూగుల్

ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా, ఇంటర్నెట్ మోసాలు ఎక్కువైపోయాయి. హ్యాకర్లు చేతివాటం ప్రదర్శిస్తూ, ఇంటర్నెట్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఈ హ్యాకర్ల వల్ల గూగుల్ క్రోమ్ యూజర్లకు ముప్పు పొంచివున్నట్టు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
సాధారణంగా ఇంటర్నెట్ వినియోగించే ప్రతి ఒక్క యూజర్ గూగుల్ క్రోమ్‌ను ఓపెన్ చేస్తుంటారు. ఈ క్రోమ్ వినియోగించే యూజర్లకు హ్యాకింగ్ ముప్పు అధికంగా ఉన్నట్టు గూగుల్ హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ యూజర్స్‌కి హ్యాకింగ్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
క్రోమ్ బ్రౌజర్‌ని తరచుగా ఉపయోగించే యూజర్స్‌ వెంటనే తరచుగా తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సూచించారు. అలానే క్రోమ్ బ్రౌజర్‌లోని హిడెన్ ఫీచర్స్‌ని యూజర్స్ ఉపయోగించాలని తెలిపారు. గూగుల్‌ రిమెంబర్‌ దిస్‌ పాస్‌వర్డ్ ఫీచర్‌ ద్వారా హ్యాకింగ్ దాడుల నుంచి యూజర్‌కి భద్రత కల్పిస్తుంది. 
 
అయితే క్రోమ్‌లో పాస్‌వర్డ్ టైప్‌ చేసిన తర్వాత దాన్ని సేవ్ చేసుకుంటే, ఒకవేళ పాస్‌వర్డ్‌ని ఎవరైనా హ్యాక్‌ చేస్తే గూగుల్ యూజర్‌కి తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 4 బిలియన్ల (400 కోట్లకు)పైగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్ గురైనట్లు తెలిపింది.
 
హ్యాకింగ్‌ నివారించేందుకు 2019లో గూగుల్ నిర్వహించిన తొలి పరీక్షల్లో 6,50,000 మంది పాల్గొన్నట్లు గూగుల్‌ ప్రతినిధి జెన్నీఫర్ తెలిపారు. వీటిలో సుమారు 3 లక్షల యూజర్ నేమ్‌, పాస్‌వర్డ్‌లు సురక్షితమైనవి కాదని గుర్తించినట్లు చెప్పారు. థర్డ్‌పార్టీ టూల్స్‌ కారణంగా హ్యాకర్స్‌కు అందిన సమాచారంతో వారు తరచుగా యూజర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటారని.. ఒకవేళ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ పటిష్టంగా ఉంటే మాత్రం హ్యాక్‌ చేయలేరని తెలిపారు. 
 
గూగుల్ క్రోమ్‌ లేదా రిమెంబర్‌ దిస్‌ పాస్‌వర్డ్‌ ఫీచర్‌ ఉపయోగించే యూజర్ పాస్‌వర్డ్ సురక్షితం కాదని భావిస్తే గూగుల్ వారిని పాస్‌వర్డ్ మార్చుకోమని సూచిస్తుంది. అలాగే, మీ ఖాతాకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద లాగిన్ జరిగినా వెంటనే మీ మొబైల్ లేదా మెయిల్‌కి అలర్ట్ మెసేజ్‌ వస్తుంది. అలానే మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ని కూడా తరచుగా మార్చుకోవమని సూచిస్తామని గూగుల్ తెలిపింది.