సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (13:41 IST)

ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం.. నోరెత్తని మెటా

ప్రముఖ సామాజిక మాధ్యమైన ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. గురువారం పూట ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది యూజర్లు ఇన్ స్టాలో సాంకేతిక లోపంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్ సైట్ డౌన్ డిటెక్టర్ వెల్లడించింది.
 
ఇప్పటివరకు సుమారు 27వేల మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు వెబ్ సైట్ తెలిపింది.  సంస్థకు అందిన ఫిర్యాదుల్లో 50 శాతం రిపోర్టులు సర్వర్ డౌన్‌కు సంబంధించినవి. మరో 20 శాతం ఇన్ స్టాలో లాగిన్ అయ్యే సమయంలో ఎదుర్కొన్నవి. దీనిపై మెటా ఇంకా స్పందించలేదు. 
 
ఇకపోతే.. ఇన్ స్టా సేవలకు విఘాతం కలగడం ఇదేమీ తొలిసారి కాదు. 2021లో కూడా ఇదే తరహాలో దీని సేవలకు అంతరాయం కలిగింది. ఇన్ స్టాలోనే కాకుండా అప్పుడప్పుడు వాట్సాప్, ఫేస్ బుక్‌లతో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే.