Jio 5G data plans -కస్టమర్ల కోసం ఇదంతా చేస్తోన్న జియో
టెలికాం ధరలు పెరగడంతో చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రైవేటు దిగ్గజ జియో కొత్త బంపర్ రీఛార్జీ ఆఫర్లను ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా రూ.200 లోపు ఉన్న మూడు 5 జీ డేటా ప్లాన్స్ వివరాలు ఇలా వున్నాయి.
జూలై నెలలో టెలికాం ధరలు భారీ ఎత్తున పెరగడంతో చాలామంది యూజర్లను కోల్పోయింది జియో. జియో రూ.189 ప్లాన్.. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటాతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం పొందుతారు.
జియో రూ.198 ప్లాన్.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు ఉంటుంది. ఇందులో మీరు ప్రతిరోజూ 2 జీబీ డేటా పొందుతారు. అంటే పూర్తిగా 28 జీబీ డేటా. అదనం 5జీ బోనస్, అపరిమిత 5 జీ డేటా పొందుతారు.
జియో రూ.199 ప్లాన్.. జియో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులు వర్తిస్తుంది. ఇందులో 1.5 జీబీ డైలీ డేటా, ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా అందుకుంటారు.