శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (17:09 IST)

ఫ్లిప్‌కార్ట్‌లో లెనోవో స్మార్ట్ ఫెస్టివల్.. భారీగా ధరల తగ్గింపు

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లెనోవో ఫెస్టివల్‌ పేరుతో స్మార్ట్ ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా లెనోవో సంస్థ ఉత్పత్తి చేసిన ఈ ఫోన్లపై 10 నుంచి 40 శాతం మేరకు డిస్కౌంట్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లెనోవో ఫెస్టివల్‌ పేరుతో స్మార్ట్ ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా లెనోవో సంస్థ ఉత్పత్తి చేసిన ఈ ఫోన్లపై 10 నుంచి 40 శాతం మేరకు డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా లెనోవో కే6 పవర్, లెనోవో కే5 నోట్, లెనోవో కే5 ప్లస్, లెనోవో పీ2 తదితర వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది. ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ సోమవారం నుంచి బుధవారం కొనసాగనుంది. 
 
తాజాగా ఆ సంస్థ ప్రకటించిన వివరాల మేరకు.. లెనోవో కే5 ప్లస్‌ పైనా 10 శాతం డిస్కౌంట్ ప్రకటించి రూ.7,499కే అందుబాటులో ఉంచింది. ఇక లెనోవో పీ2(3జీబీ ర్యామ్) పై ఏకంగా రూ.4వేలు తగ్గించింది. దాని అసలు ధర రూ.16,999 కాగా రూ.12,999కే అందిస్తోంది.
 
అలాగే, లెనోవో కే5 నోట్‌లో అందుబాటులో ఉన్న రెండు వేరియంట్లపైనా రూ.2 వేలు తగ్గించింది. 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్ ధర రూ.12,499 కాగా దానిని రూ.10,499కే అందిస్తోంది. కే5 నోట్ 3జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ.11,999 కాగా రూ.9,999కే అందిస్తోంది.