శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (14:55 IST)

నోకియా అభిమానులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Nokia
Nokia
నోకియా అభిమానులకు గుడ్ న్యూస్. నోకియా జీ60 5జీ మోడల్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లో రిలీజ్ కానుంది. నోకియా ఇండియా పోర్టల్‌లో 'స్మార్ట్ ఫోన్ల' విభాగంలో జీ60 ఉత్పత్తి, స్పెసిఫికేషన్ల డీటైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో దీన్ని తయారు చేశారు.
 
ఫోన్‌పై రెండేళ్ల వారంటీ, మూడేళ్ల పాటు అప్ డేట్స్‌కు సంస్థ హామీ ఇస్తోంది. ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోరూ.20వేల లోపు నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
 
ఫీచర్స్:
ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా, 
వెనుక భాగంలో 50 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్, 
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌
6.58 అంగుళాల డిస్ ప్లే, 
120 హెర్జ్ రీఫ్రెష్ రేట్, 
కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్
2 మెగాపిక్సల్‌తో మూడు కెమెరాలు
4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ చార్జర్
ఈ ఫోన్ బ్లాక్, ఐస్ అనే రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది.