1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (11:40 IST)

సఫారీల చేతిలో ఓడిపోవడానికి కారణం ఇదే : భారత బౌలర్ భువి

bhuvaneshwar kumar
ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం పెర్త్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారత టాపార్డర్ కుప్పకూలిపోయింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే రాణిచండంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 133 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంతో సఫారీలు తడబడినప్పటికీ చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకున్నారు. 
 
ఈ ఓటమిపై భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ, బౌలర్ల కృషికి మెరుగైన ఫీల్డింగ్ తోడై ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పారు. 12వ ఓవర్ మార్కరమ్ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ జారవిడిచాడని, అలాగే, 13వ ఓవర్‌లో మార్కరమ్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ మిస్ చేశాడని చెప్పాడు. ఈ లైఫ్‌లతో మార్కరమ్ సద్వినియోగం చేసుకుని మ్యాచ్‌ను మలుపుతిప్పాడని చెప్పాడు. 
 
క్యాచ్‌లు, రనౌట్‌లు మిస్ చేసుకోవడం ఫలితాన్ని తారుమారు చేసిందని భువనేశ్వర్ పేర్కొన్నాడు. అలాగే, పిచ్ నుంచి వచ్చిన అదనపు పేస్, బౌన్స్ భారత టాపార్డర్‌ను దెబ్బతీసిందన్నారు. బ్యాటింగ్‌కు పిచ్ ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయం తెలుసన్నారు.