శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (15:08 IST)

రిలయన్స్ జియో ఫ్రీడమ్ ఆఫర్‌.. 50 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు..

JioFi
రిలయన్స్ జియో ప్రకటించిన ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో ప్రకటించిన ఫ్రీడమ్ ఆఫర్ మరి కొద్దిరోజులు అందుబాటులో ఉండనుంది. ఏకంగా ఏడాది పాటు మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ఉచితంగా అందుకోవచ్చు. 
 
ఇది రిలయన్స్ జియో అందిస్తున్న ఫ్రీడమ్ ఆఫర్. కేవలం 50 రూపాయలతో ఈ ఆఫర్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడీ ఆఫర్ తీసుకుంటే జియో మొబైల్ వార్షిక రీఛార్జ్ ప్లాన్ పూర్తిగా ఉచితంగా లభించనుంది. 
 
ఇందుకు జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ కేవలం 50 రూపాయలకే బుక్ చేసుకుంటే చాలు. ఆ 50 రూపాయలు కూడా రిఫండ్ వచ్చేస్తాయి. ఈ ఎయిర్ ఫైబర్ ప్లాన్ టారిఫ్ కేవలం 2121 రూపాయలు మాత్రమే. 
 
అంతేకాకుండా ఎయిర్‌ఫైబర్ ఇన్‌స్టాలేషన్ 1000 రూపాయల విలువైంది ఉచితంగా అందుతుంది. అంటే కేవలం 2121 రూపాయలతో 3 నెలల ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే 3599 రూపాయల విలువైన మొబైల్ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.