శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జులై 2024 (17:32 IST)

జియో మరో కీలక నిర్ణయం : ఇకపై రెండు రకాల వార్షిక ప్లాన్లు మాత్రమే...

jio reliance
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థ తన మొబైల్ వినియోగదారులకు కేవలం రెండు వార్షిక ప్రీపెయిడ్‌ ప్లాన్లను మాత్రమే అందిస్తోంది. గతంలో ఈ కేటగిరీలో పలు ప్లాన్లను ఇచ్చిన ఈ సంస్థ టారిఫ్‌లను పెంచిన తర్వాత వాటిని రెండుకు తగ్గించింది. ఈ రెండింటి ప్రయోజనాల్లోనూ మార్పులు చేసింది. రోజుకు 1.5జీబీ, 2జీబీ డేటా అందించే కేటగిరీలో అసలు వార్షిక ప్లాన్లే లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో జియో అందిస్తున్న ఆ రెండు యాన్యువల్‌ ప్లాన్లేంటి? వాటి బెనిఫిట్స్‌ ఎలా ఉన్నాయో పరిశీలిద్ధాం. 
 
రిలయన్స్‌ జియో అందిస్తున్న రూ.3,999 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్‌ లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఫ్యాన్‌కోడ్‌, జియో సినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తాయి. ఫ్యాన్‌కోడ్‌ సభ్యత్వం జియోటీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందాల్సి ఉంటుంది. జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లో ప్రీమియం కంటెంట్ ఉండదు. వీటితో పాటు అపరిమిత 5జీ డేటా ప్రయోజనం అదనం.
 
రిలయన్స్‌ జియో రూ.3,599 ప్లాన్‌లోనూ రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. అపరిమిత కాలింగ్‌ ఉంటుంది. జియో సినిమా, జియోటీవీ, జియోక్లౌడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అపరిమిత 5జీ డేటా ఉచితం. దీంట్లోనూ జియోసినిమా సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీమియం కంటెంట్ ఉండదు.