Dharma Sangrah
✕

ఫేస్‌బుక్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేస్తే ఫైన్... ఎక్కడ?

ఫేస్‌బుక్, ట్విట్టర్ సోషల్ మీడియాలు జీవితంలో సర్వసాధారణమయ్యాయి. ఈ రెండు ఖాతాలు లేనివారు లేరనే చెప్పొచ్చు. అభిప్రాయాలు,జ్ఞాపకాలు ఇతరులతో పంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.

Written By pnr
Updated: ఆదివారం, 21 జనవరి 2018 (10:46 IST)
ఫేస్‌బుక్, ట్విట్టర్ సోషల్ మీడియాలు జీవితంలో సర్వసాధారణమయ్యాయి. ఈ రెండు ఖాతాలు లేనివారు లేరనే చెప్పొచ్చు. అభిప్రాయాలు,జ్ఞాపకాలు ఇతరులతో పంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇష్టమైన వారితో కలసి మనం దిగిన ఫొటోలను ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటాం. మన జ్ఞాపకాలు, మనం చేసిన చిలిపి పనులను మనకు సంబంధించిన వారికి తెలియజేయాలనే ఆనందంతో ఇలా పెడుతుంటారు.
 
ఇలాగే ఓ తల్లి కూడా తన కొడుకు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టింది. అయితే అది కాస్తా సీరియస్ అయ్యింది. ఎందుకంటే ఆ కన్న కొడుకు తల్లిపై కోర్టుకెక్కాడు. తన పర్మిషన్ లేకుండా ఫేస్‌బుక్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేసిందంటూ కోర్టులో కేసు వేశాడు. తన తల్లి ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో తన ఫొటోలు పెడుతోందని ఇటలీకి చెందిన 16 ఏళ్ల బాలుడు గతేడాది డిసెంబర్‌ 23న కోర్టులో కేసు వేశాడు. 
 
ఈ ఫొటోల కారణంగా తన సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయని, దీంతో అమెరికాకు వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ ఫొటోలన్నింటినీ 2018 ఫిబ్రవరి 1లోగా తొలగించాలని.. లేకపోతే దాదాపు రూ.7.8 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుందని రోమ్‌లోని కోర్టు జడ్జి మోనికా వెల్లెట్టి తీర్పునిచ్చారు.
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Shiva Kandukuri :పెళ్లి పీటలెక్కబోతున్న హీరో శివ కందుకూరి. శిర సింహా, డిసెంబర్ లో వివాహం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కూ ధనుష్ చిత్రం ఓం ఆపరేషన్ మోల్ కు సంబంధం ఏమిటి ?

హను-మాన్ విజయం తర్వాత పెద్ద ప్రకటన చేసిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్

Om Review:ఆకట్టుకోలేని కథగా ధనుష్, మమ్ముట్టి నటించిన ఓమ్ రివ్యూ

నా బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు : 'యాక్షన్ కింగ్' అర్జున్

తర్వాతి కథనం
Show comments