సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 18 జనవరి 2018 (13:29 IST)

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి?

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి అంటున్నారు మానసిక నిపుణులు. పెళ్లికి ముందు పరిస్థితి వేరు పెళ్లయ్యాక పరిస్థితి వేరు. వివాహమైన తర్వాత జీవితంలోనే కాదు.. ఫేస్‌బుక్‌లోనూ కొన్ని మార్పులు చేయడం తప్పనిసరి. ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కచ్చితంగా

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి అంటున్నారు మానసిక నిపుణులు. పెళ్లికి ముందు పరిస్థితి వేరు పెళ్లయ్యాక పరిస్థితి వేరు. వివాహమైన తర్వాత జీవితంలోనే కాదు.. ఫేస్‌బుక్‌లోనూ కొన్ని మార్పులు చేయడం తప్పనిసరి. ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కచ్చితంగా నిర్ధారించుకోండి. పెళ్లి తర్వాత ఆలోచనలూ, పర్యటనలకు సంబంధించిన ఫోటోలు కేవలం కొందరికే పరిమితం అయ్యేలా చూడండి. 
 
సామాజిక సైట్‌లలో భాగస్వామి ఉండాలా, వద్దా.. అనే విషయంపై ఎదుటి వారికున్న హక్కుని గౌరవించి తీరాల్సిందే. ఫేస్ బుక్ అప్‌డేట్స్‌పై భాగస్వామి సలహా, అనుమతి తీసుకోవాల్సిందే.
 
కొందరమ్మాయిలు మెట్టింట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్నీ ఎలా ఎదుర్కొంటున్నామోనన్న విషయాలను, సలహాలను చెబుతూ రాసేస్తుంటారు. ఇటువంటివి మీ స్నేహితులకి విసుగు తెప్పించవచ్చు. అలాంటి వాళ్లు మిమ్మల్ని అన్ ఫ్రెండ్ చేసే ప్రమాదముందని మానసిక నిపుణులు అంటున్నారు. ఇకపోతే భాగస్వామి స్నేహితులతో పరిచయం కొన్నిసార్లు ఇబ్బందులను కూడా తీసుకురావచ్చు కనుక పెళ్లయ్యాక సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా వుంటే మంచిదంటున్నారు.