సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (18:36 IST)

భారత మార్కెట్లోకి రియల్‌మీ నుంచి 10 సిరీస్‌.. ధర, స్పెసిఫికేషన్స్

Realme 10
Realme 10
రియల్‌మీ నుంచి తాజాగా 10 సిరీస్‌ భారత మార్కెట్లోకి రానుంది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ10 ప్రో, రియల్‌మీ 10 ప్రో+ పేరుతో ఫోన్‌లను తీసుకురానున్నారు. నవంబర్‌ 9వ తేదీన మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేయనున్నారు. 
 
రియల్‌మీ 10ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌+128 జీబీ, 4 జీబీ+64 జీబీ వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఇక ధర విషయానికొస్తే రియల్‌మీ 10 సిరీస్‌ ఫోన్‌లు రూ. 15,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.
 
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
రియల్‌మీ 10 ప్రో+లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే
మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
 
రియల్‌మే 10 రష్ బ్లాక్ వెర్షన్.. ఈ స్మార్ట్‌ఫోన్ కుడి వైపు ఫ్రేమ్‌లో వాల్యూమ్ రాకర్‌ను కలిగి ఉందని చూపిస్తుంది, ఇది పవర్ బటన్‌తో జతచేయబడుతుంది.