ఐఫోన్‌ను ట్రోల్ చేసిన శామ్‌సంగ్.. లక్షలు పెట్టి ఫోన్ కొంటే ఛార్జర్ ఇవ్వరా?
ఐఫోన్‌ను శామ్‌సంగ్ ట్రోల్ చేసింది. ఐఫోన్ 12 సిరీస్‌ను ఇటీవలే యాపిల్ సంస్థ ప్రకటించింది. దీని ధరలు ఎప్పటిలాగే ఆకాశాన్ని తాకాయి. అయితే ఓ విషయంపై మాత్రం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అదేమిటంటే ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ ఫోన్‌ను కొన్నవారికి ఛార్జర్ ఇవ్వకపోవడమే. లక్ష రూపాయలు మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఛార్జర్ ఇవ్వకపోవడం ఏమిటని శామ్‌సంగ్ ప్రశ్నించింది.
యాపిల్ ఫోన్‌ను కొనడమే కాకుండా మళ్లీ ఛార్జర్ కొండమేమిటని నెటిజన్లు యాపిల్ సంస్థను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో యాపిల్ ను ట్రోల్ చేస్తున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
శాంసంగ్.. యాపిల్ సంస్థకు రైవల్ అన్న సంగతి తెలిసిందే. తన తాజా పోస్టులో యాపిల్ కంపెనీని ట్రోల్ చేస్తూ పోస్టు పెట్టింది. 'మీ గెలాక్సీ.. మీరు ఏది కోరుకుంటున్నారో అది ఇస్తుంది.. ఛార్జర్, బెస్ట్ కెమెరా, బ్యాటరీ, పెర్ఫార్మన్స్, 120 హెడ్జెస్ స్క్రీన్' అంటూ ఫేస్ బుక్‌లో పోస్టు చేసింది.
ముఖ్యంగా నలుపు రంగు ఉన్న ఛార్జర్ ఫోటోను పోస్టు చేసి తాము ఛార్జర్ ఇస్తామని తెలిపింది. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 70వేలకు పైగా రియాక్షన్లు వచ్చాయి, 10000కు పైగా కామెంట్లు చేశారు.