ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (14:55 IST)

పబ్జీపై నిషేధం.. చైనా ఫైర్.. స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే బ్యాన్.. పీసీ వెర్షన్ ఇంకా చావలేదు..

డేటా ప్రైవసీ, జాతీయ భద్రతకు ముప్పు వంటి కారణాల వల్ల భారత ప్రభుత్వం తాజాగా చైనాకు చెందిన 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రజాదరణ పొందిన పబ్‌జీ కూడా నిషేధాన్ని ఎదుర్కొంది. దీంతో మొత్తం నిషేధానికి గురైన మొబైల్ యాప్‌ల సంఖ్య 224కు చేరింది. ఈ నేపథ్యంలో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 
 
వీటిని నిషేధించడం చైనీస్ ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి గావో ఫెంగ్ మీడియా బ్రీఫింగ్‌లో మాట్లాడుతూ, చైనీస్ మొబైల్ యాప్స్‌పై భారత దేశం విధించిన నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. పబ్జీ గేమ్‌లో కాలం గడిపిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే తాజాగా వారికి మరో శుభవార్త దక్కింది. దేశంలో పబ్జీ ఇంకా పూర్తి స్థాయిలో నిషేదం జరగలేదు. కేంద్రం స్మార్ట్ ఫోన్ల కోసం డెవలప్ చేసిన గేమ్‌ను మాత్రమే బ్యాన్ చేశారు. అయితే ఇంకా పీసీ వెర్షన్ పబ్‌జి గేమ్‌ అలాగే ఉంది. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
 
కాగా, ఈ గేమ్‌ను ముందుగా ఐర్లాండ్‌కు చెందిన వీడియో గేమ్ డెవలపర్ బ్రెండాన్ గ్రీన్ డెవలప్ చేసింది. ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పుడే ఇది పీసీ, కన్సోల్ వెర్షన్లను విడుదల చేసింది.
 
మొబైల్ వెర్షన్‌లో తయారు చేసేందుకు చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీతో ఒప్పందం జరిగింది. దీంతో 2017 రెండూ కలిసి మొబైల్ వర్షన్‌లో విడుదల చేశాయి. ఆ గేమింగ్ యాప్ మాత్రమే ఇటీవల కేంద్రం నిషేదిత జాబితాలో చేర్చింది. దీంతో పీసీ వెర్షన్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.