మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (17:43 IST)

బ్రేకింగ్ న్యూస్.. పబ్‌జీతో పాటు 118 యాప్‌లపై నిషేధం..

చైనా సరిహద్దుల్లో చేసిన ఓవరాక్షన్‌తో పాటు కరోనాను నియంత్రించడంలో విఫలం కావడంతో గుర్రుగా వున్న మోదీ సర్కారు.. ఇప్పటికే 51 యాప్‌లపై నిషేధం విధించింది. అయినా భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
 
118 చైనా యాప్స్‌ని బాన్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. అందులో పబ్ జీ కూడా ఉంది. తొలి విడతగా 60 వరకు యాప్స్‌ని రెడీ చేసిన కేంద్రం ఇప్పుడు 118 యాప్స్‌ని నిషేధించింది.  
 
కాగా జూన్ నెలలో, టిక్ టాక్, యుసి బ్రౌజర్, వీచాట్ వంటి 59 చైనీస్ మొబైల్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధించింది. ఇవి భారతదేశం సార్వభౌమత్వానికి, సమగ్రతకు, రక్షణకు, భద్రతకు నష్టాన్నిస్తాయనే కారణంగా నిషేధం కొరడా ఝుళిపించడం జరిగిందని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.