శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (17:56 IST)

రోజుకు 16 గంటలు పబ్జీ ఆడేవాడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

పబ్జీ ఓ ప్రాణం తీసింది. లాక్ డౌన్ కారణంగా పబ్జీకి అలవాటు పడిన వ్యక్తి.. అదే వ్యసనంగా మారడంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిఖిల్ పురుషోత్తం పిలెవన్ అనే వ్యక్తి పింపిరి ముఖ్‌త్యర్ గ్రామంలో నివసిస్తున్నాడు. నిఖిల్ పూనెలోని ఓ ప్రైవేట్ ఫాంలో పనిచేస్తున్నాడు. 
 
బీఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా మధ్యలోనే ఉండిపోయాడు. దీంతో రోజుకు 16 గంటల పాటు పబ్‌జీ ఆడుతూ వుండేవాడు. పనికోసం తల్లిదండ్రులు బయటికి వెళ్లడంతో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పబ్‌జీకి బానిసకావడంతోనే నితిన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆతని సోదరుడు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.