శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (13:30 IST)

శామ్‌సంగ్ నుంచి Galaxy M Prime.. అమేజాన్ ఇండియాలో సేల్

Samsung Galaxy M Prime
శామ్‌సంగ్ నుంచి భారతీయ మార్కెట్లోకి కొత్త ఫోన్లు విడుదలవుతూనే వున్నాయి. తాజాగా Samsung Galaxy M Prime అనే మరో ఫోన్ అతి త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతోంది. అమేజాన్ ఇండియా ద్వారా గ్యాలెక్సీ ఎమ్ ప్రైమ్ విక్రయించబడుతుంది. ఈ ఫోనులో Exynos 9611 ప్రాసెసర్ అమర్చబడి ఉంటుంది. ఇది శామ్‌సంగ్ స్వయంగా అభివృద్ధి చేసిన ప్రాసెసర్ కావడం గమనార్హం. 
 
మెరుగైన పనితీరు, విద్యుత్ తక్కువగా వినియోగించుకునే స్వభావాన్ని ఈ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. 6జిబి రామ్, 64, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన రెండు మోడల్స్‌గా ఈ ఫోన్ లభిస్తుంది. 512 జీబీ వరకు మెమరీ కార్డు ద్వారా అదనంగా స్టోరేజ్ పొందొచ్చు. 
 
ఫోన్ వెనుక భాగంలో 64 megapixel ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సల్ ultrawide కెమెరా, 5 మెగా పిక్సల్ డెప్త్ సెన్సార్, మాక్రో షాట్లకి మరో కెమెరా, ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. 4K వీడియో రికార్డింగ్ ఇది సపోర్ట్ చేస్తుందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇకపోతే.. ఫీచర్ల సంగతికి వస్తే..?
ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలు, 
ముందు భాగంలో waterdrop notch‌తో ఫ్రంట్ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్
6.53 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉండే అవకాశం ఉంది.
డ్యూయెల్ సిమ్, డుయెల్ వోల్ట్, 6000 mAh భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి వుంటుంది. 
15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వుంటుంది.