సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (20:17 IST)

పబ్‌జి మొబైల్ ఇండియా రెడీ.. డౌన్ లోడ్ చేసుకోవచ్చు.. కానీ..?

భారత్‌లో బ్యాన్ అయిన పబ్‌జి మొబైల్ మళ్లీ పబ్‌జి మొబైల్ ఇండియా పేరిట సంగతి తెలిసిందే. గేమ్‌కు అనేక మార్పులు చేసి మళ్లీ లాంచ్ చేయనున్నట్లు పబ్‌జి కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో గేమ్ విడుదల కోసం పబ్‌జి ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కానీ పబ్‌జి మొబైల్ ఇండియా గేమ్‌కు చెందిన ఏపీకే (గేమ్ ఫైల్)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్తూ ఒక లింక్ తాజాగా పబ్‌జి అధికారిక సైట్‌లో కనిపిస్తోంది. 
 
పబ్‌జి మొబైల్ అధికారిక సైట్‌లో పబ్‌జి మొబైల్ ఇండియా గేమ్‌కు చెందిన ఏపీకే ఇన్‌స్టాలేషన్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా గూగుల్ ప్లేలో గేమ్‌ను పొందండి.. అంటూ ఒక మెసేజ్ దర్శనమిస్తోంది. అయితే గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసినా ప్రస్తుతానికి అది పనిచేయడం లేదు. 
 
కానీ గేమ్‌ను అతి త్వరలోనే లాంచ్ చేయవచ్చని, అందుకనే సైట్‌లో లింక్‌ను ఉంచారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన పబ్‌జి ప్రియులు సోషల్ మీడియా వేదికగా తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.