ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:17 IST)

వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పిల్లలకు పాఠశాలల్లో వేసవి సెలవులు కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రకటించేశారు. మరికొన్ని చోట్ల రేపు వారం వరకు పాఠశాలలు పని చేయనున్నాయి. కాగా పాఠశాలలు తిరిగి జూన్ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మధ్యలో ఉన్న కాలాన్ని పిల్లల తల్లిదండ్రులకు పెద్ద పరీక్షా కాలంగా చెప్పవచ్చు.


పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉండాలి. పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రమాదం జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు పాటించడం మంచిదని గ్రహించండి.
 
ఈ జాగ్రత్తలు పాటించండి..
 
* పిల్లలను బావుల్లో, అలాగే చెరువుల్లో ఈత కొట్టేందుకు పంపించకండి..అవసరమైతే మీరే స్వయంగా వారికి తోడుగా వెళ్లండి.
 
* మోటార్‌సైకిల్ నడపమని వారి చేతికి తాళాలు ఇవ్వకండి. వారికి తాళాలు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.
* మొబైల్ ఫోన్‌లు, ట్యాబ్‌లు వారి చేతికి ఇవ్వకండి.
 
* స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి.
* మధ్యాహ్న సమయంలో ఆరుబయట ఆడుకోవడానికి అనుమతించకండి. ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే ఆడుకోవడానికి వారికి అనుమతినివ్వండి.
 
* ఇంట్లో పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడండి.
* వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని మన సంప్రదాయాలను నేర్పించాలి.
* సంప్రదాయ పనులు గురించి వారికి చెప్పాలి. ఇలా పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి.
* సంప్రదాయ పనులు చెప్పాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవి సెలవులు ఇట్టే గడిచిపోతాయి.