నా ప్రశ్నకు బదులేది?
త్వర త్వరగా బయలుదేరాను
కార్యక్రమానికి సమయానికి చేరాలని
వేచి వున్నాను బస్టాపులో
రాలేదు బస్సు
ఆందోళన మొదలైంది ఆలస్యమౌతుందని
విసుగుతోనే వున్నారు ప్రతివారూ బస్ఠాపులో
మీ కోసమే ఈ ప్రభుత్వం
మీ క్షేమమే మా క్షేమమం
ప్రకటనలు పలువిధాలు
అనుకోరు అమలు పరచాలని
నడపరు నమయానికి బస్సులు
పరిష్కారముండదు ప్రయాణికుల ఇక్కట్లకు
ఇంతలో బస్సు వచ్చింది గంట తరువాత
ఎక్కాను బస్సు
అడిగాను కండక్టర్ని ఆలస్యమెందుకని
త్వరగా వెళ్ళాలనుకుంటే వున్నాయి ఆటోలు ఓలాలు
బాధ్యతారహితమైన
నిర్లక్ష్యంతో కూడిన
మర్యాద లేని జవాబు
అసలు నా ప్రశ్నకు బదులే లేదు
ఎక్కడికి వెళ్ళాలో చెప్పు
చెపుతూ డబ్బులిచ్చాను
టిక్కెట్టిచ్చాడు తిరిగి చూడకుండా వెళ్ళాడు
నోరెత్త లేదు తోటి ప్రయాణికులెవ్వరూ
మౌనం దాల్చాను చేసేది లేక
వచ్చింది దిగవలసిన చోటు. దిగాను
అప్పటికే గంట ఆలస్యం
ఎవరితో చెప్పుకోవాలి
ఏమని చెప్పాలి.
రచన... గుడిమెట్ల చెన్నయ్య, చెన్నై