సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (19:30 IST)

మహాశివుడిని.. మహాశివరాత్రి రోజు.. ఇలా పూజిస్తే...?

మహాశివుడిని రోజూ పంచాక్షరీ మంత్రంతో పూజిస్తే సకల దోషాలు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాంటిది మహాశివరాత్రి రోజున ఉపవసించి.. మహాశివునిని పంచాక్షరీతో స్తుతిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయి. మహాశివరాత్రి రోజున వ్రతాన్ని చేపడితే ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ ఇంట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.


మాఘ మాసం, కృష్ణ పక్షం చతుర్థిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రికి మహిమ ఎక్కువ. అమరకేశం శివ అంటే మంగళం అని చెప్పబడి వుంది. అందుకే శివరాత్రి రోజున ఉపవసించి.. జాగరణ చేసి ఆలయాల్లో జరిగే అభిషేకాలు, పూజల్లో పాల్గొనే వారికి సకల సంపదలు చేకూరుతాయి. 
 
శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి.. ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకుని.. పూజగదిని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఒంటి పూట భోజనం చేసి.. రాత్రి పూట జాగరణ చేయాలి. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు ఈశ్వరునికి నైవేద్యం సమర్పించి.. భోజనం చేయాలి. ఇక ఓం నమ:శివాయ ఇది పంచాక్షరీ మంత్రం. శివ అంటే మంగళకరం అని అర్థం.
 
శివ పంచాక్షరీ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. నిర్మలమైన మనసుతో వీటిని ఉచ్చరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం సాధిస్తారు. శివ మంత్రోచ్చరణలో కొన్ని విశిష్టమైనవి ఏకాదశ రుద్ర మంత్రాలు. ఏకాదశ రుద్ర మంత్రాలను ప్రత్యేకంగా శివరాత్రి రోజున జపిస్తే మహారుద్ర యాగం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు. 
 
కపాలీ- ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్ 
పింగళ- ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమ: 
భీమ- ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం
విరూపాక్ష- ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమ:
విలోహిత- ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం 
శశస్త- ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమ: 
అజపాద- ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం 
అహిర్బుధన్య- ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం 
శంబు- ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమ: 
చంద- ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్ 
భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ: 
 
ఈ మంత్రాలను రోజుకు 108 సార్లు చొప్పున మహాశివరాత్రి నుంచి 40 రోజుల పాటు జపిస్తే విశేష ఫలితం ఉంటుంది. మిగతా రోజుల్లో ఉదయం 9 సార్లు, సాయంత్రం 9 సార్లు వీటిని ఉచ్చరిస్తే ఉన్నత పదవులను అలంకరిస్తారని.. ప్రతి కార్యంలోనూ విజయం మీ సొంతం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.