ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (19:43 IST)

భారత్‌కు మరో 10 రాఫెల్‌ యుద్ధ విమానాలు

భారత అమ్ములపొదిలోకి మరో పది రాఫెల్‌ యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. దీంతో భారత వైమానిక దళంలోని యుద్ధ విమానాల సంఖ్య 21కు చేరుకోనుంది. ఇప్పటికే 11 విమానాలు..అంబాలలోని 17వ స్వ్కాడ్రన్‌లో చేరాయి.

మరో రెండు, మూడు రోజుల్లో 3 రాఫెల్‌ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌ నుండి భారత్‌ రానున్నాయని తెలిపారు. వచ్చే నెలలో రెండవ విడతలో మరో 7-8 యుద్ధ విమానాలు ఇక్కడకు చేరుకుంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

వీటి రాకతో వైమానిక దళం మరింత బలోపేతం కానుందని అన్నారు. మొత్తం 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం భారత్‌ 2016లో ఫ్రెంచ్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. కొన్ని విమానాలు గత ఏడాది జులై-ఆగస్టుకు భారత్‌కు చేరుకున్నాయి. వాటిని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు.