పబ్‌జీకి పోటీగా మరో ఇండియన్ గేమ్!
ఆన్‌లైన్ బ్యాటిల్ గేమ్ పబ్‌జీకి పోటీగా మరో ఇండియన్ గేమ్ రాబోతోంది. ఇప్పటికే ఫౌజీ అనే గేమ్ పబ్‌జీకి పోటీగా వచ్చింది. ఈ గేమ్‌ను ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో స్టూడియో ఎన్‌కోర్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది. అయితే ఈ గేమ్ అంతగా సక్సెస్ కాలేదు.
కాగా.. ఇప్పుడు మరో భారతీయ గేమ్ ఈ పోటీలోకొచ్చింది. సికో పేరుతో రాబోతున్న ఈ గేమ్‌ను ఇండిక్ అరెనా అనే డెవలపర్ కంపెనీ రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ట్రైలర్‌ను సికో తాజాగా విడుదల చేసింది.
ఈ గేమ్ పబ్‌జీకి గట్టి పోటీ ఇస్తుందని, ఇందులో పబ్‌జీక పోటీగా అనేక కీలక ఫీచర్లున్నాయని సికో చెబుతోంది. ట్రైలర్ ప్రకారం చూస్తే అడవులు, దేవాలయ ప్రాంగణాలు, ఆఫీస్‌లలో ఈ వార్ గేమ్ ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ గేమ్‌కు సంబంధించిన డేటా గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంది. దాని డిస్క్రిప్షన్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌తో ఈ గేమ్ ఆడుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గేమ్ ప్రీ రిజిస్ట్రేషన్ కూడా మొదలైంది.
అయితే ఈ గేమ్ ఎప్పుడు పూర్తిగా అందుబాటులోకి వస్తుందో ఇంకా తెలియరాలేదు. మరి ఈ గేమ్ పబ్‌జీకి సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందో లేదో చూడాలి.