శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (16:06 IST)

గుజరాత్‌: ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది మృతి

గుజరాత్‌లో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోర్బి జిల్లా హల్వాద్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందికిపైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 
 
సమాచారం అందుకున్న రెస్క్యూటీమ్.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 13 మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరికొంత మంది మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు.  
 
క్షతగాత్రులును స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
కాగా, మధ్యాహ్నం భోజనం సమయం కావడంతో చాలా మంది కూలీలు తినడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. లేదంటే.. చాలా మంది ఈ ప్రమాదంలో బాధితులయ్యేవారని స్థానికులు చెబుతున్నారు.