మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (14:49 IST)

పాము కరిచిందనీ దాన్ని కొరికి చంపేసిన బాలుడు... ఎక్కడ?

snake
తనను కరిచిన పామును ఓ బాలుడు కొరికి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జశ్‌పురి జిల్లా పంద్రపుత్ గ్రామంలో అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలోని పహాడీ కోర్వా అనే గిరిజన తెగగు చెందిన దీపక్ రామ్ (12) అనే బాలుడు తన ఇంటికి సమీపంలో సోదరితో కలిసి ఆట్లాడుకుంటున్నాడు. ఆ సమంయలో అక్కడకు వచ్చిన పాము ఒకటి ఆ బాలుడి చేతిపై కాటేసింది. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ బాలుడు.. పారిపోతున్న పామును పట్టుకుని గట్టికా కొరికేశాడు. ఈ విషయం తెలుకున్న కుటుంబ సభ్యులు ఆ బాలుడిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే, ఆ బాలుడు కరిచిన పాము మాత్రం ప్రాణాలు విడిచింది. దీంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు.