శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (12:27 IST)

హర్యానా: కోవిడ్‌తో 13మంది ఖైదీలు పరార్.. జనాల్లో వణుకు

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న తరుణంలో హర్యానాలో భయాందోళనలు కలిగే ఘటన జరిగింది. హర్యానాలో కరోనా పాజిటివ్ ఉన్న 13మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దీంతో జైలు అధికారులతో పాటు బైట అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ సోకిన 13 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారని తెలిసి జనాలు కూడా భయపడిపోతున్నారు.
 
కరోనా సోకిన ఖైదీలకు చికిత్సనందించేందుకు హర్యానాలోని రెవారి పట్టణంలోని జైలును ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో కరోనా బారినపడిన ఖైదీలను ఇక్కడికే తరలించి వారికి చికిత్సనందిస్తున్నారు. అలా ఇప్పటి వరకూ వివిధ జైళ్లనుంచి తరలించిన 493 మంది ఖైదీలకు చికిత్స అందిస్తున్నారు.
 
ఈ క్రమంలో కరోనా చికిత్స తీసుకంటున్న 13 మంది ఖైదీలు శనివారం సినిమా స్టైల్లో ఖైదీలు పరారయ్యారు. జైలు ఊచలను తొలగించి.. బెడ్ షీట్లను తాళ్లలా తయారు చేసి వాటిని ఉపయోగించి ఎస్కేప్ అయ్యారు.
 
ఈ విషయం గుర్తించిన జైలు అధికారులు ఆఘమేఘాలమీద చర్యలు చేపట్టారు. వంటనే అప్రమత్తమైన పోలీసులు పరారైన ఖైదీల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. వారిని పట్టుకోవటానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 
 
పరాయైన ఖైదీలు రాష్ట్రం దాటిపోకుండా సరిహద్దులు దాటి పోకుండా అప్రమత్తం చేశారు. తప్పించుకుపోయిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలు అధికారుల నిరక్ష్యంపై కూడా ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి కొనసాగిస్తున్నారు.